అటవీ అమరవీరుల త్యాగాలు మరవలేని. ఫారెస్ట్ రేంజర్ నాసిర్ ఝా

అటవీ అమరవీరుల త్యాగాలు మరవలేని. ఫారెస్ట్ రేంజర్ నాసిర్ ఝా

బండి ఆత్మకూరు, వెలుగు న్యూస్: అటవీ సంపద వన్య ప్రాణుల సంరక్షణ కోసం విధి నిర్వహణలో అశువులు బాసి అమర వీరులైన అటవీ అధికారులు, సిబ్బంది త్యాగాలు మరువలేనివని బండి ఆత్మకూరు ఫారెస్ట్ రేంజర్ నాసిర్ ఝ అన్నారు. మండలంలోని స్థానిక అటవి శాఖ కార్యాలయంలో రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాసిర్ ఝ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 10 తేదిన రాష్ట్ర అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నారు.వన్య ప్రాణుల వేట, కలప అక్రమ రవాణా, వెదురు అక్రమ రవాణా ,అటవీ భూముల ఆక్రమణ వంటి సున్నిత అంశాల విషయంలో తగు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని సిబ్బంది అందరూ సమ్మేళనంతో వ్యవహరించి అటవీ రక్షణలో పాటుపడాలని తెలియజేశారు. అలాగే సిబ్బంది అందరూ ఐకమత్యంగా ఉండి పరిసర గ్రామాల ప్రజల పట్ల సన్నిహితంగా ఉంటూ వారు అడవికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా కలప అక్రమ రవాణా విషయంలో కానీ, జంతువుల విషయంలో కానీ ఎటువంటి హాని తలపెట్టకుండా చేసేటట్టు చూసుకునే బాధ్యత సిబ్బందికి ఉందని తెలియజేశారు. అలాగే సిబ్బంది అటవీ విధి నిర్వహణలో వారి యొక్క దైనందిన కార్యకలాపాలలో తగు జాగ్రత్తలు తీసుకొని వన్యప్రాణుల యొక్క కదలికలు జాగ్రత్తగా గమనిస్తూ అలాగే వేటగాళ్లు, కానీ ఉచ్చులు వేసే స్మగ్లర్లు పట్ల నిఘా ఉంచాలని, అలాగే విధి నిర్వహణలో జంతువుల వల్ల కలిగే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మనకు ఎటువంటి హాని కలగకుండా తగు జాగ్రత్తతో మసలుకోవాలని సూచించారు. అలాగే స్మగ్లర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరైనా అడవిలోకి అక్రమంగా ప్రవేశించి కలపన గాని వెదురు గాని నరికి బయట ప్రాంతాలకు తరలించిన ఎడల అటువంటి వాహనాలను పట్టుకుని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే వన్యప్రాణులకు ఉచ్చులు వేయడం కానీ వాటికి ఎటువంటి హాని తలపెట్టిన గాని అటువంటిచర్యలకు పాల్పడిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకొని వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తామని హెచ్చరించారు .అలాగే స్మగ్లర్ల గురించి గానీ ఇతరత్రా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి ఎవరైనా తగు సమాచారమిచ్చిన యెడల వారి వివరాలను గోప్యంగా ఉంచి వారికి తగిన పారితోషికం ఇప్పిస్తామని రేంజర్ గారు ఈ సందర్భంగా తెలియజేశారు .చుట్టుపక్కల గ్రామాల వాళ్లు ఎటువంటి సమాచారం ఉన్న ఈ నెంబరు కు 9885509574 సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!