అధిక ధరలకు టపాసులు అమ్మకుండా నియంత్రించాలి

అధిక ధరలకు టపాసులు అమ్మకుండా నియంత్రించాలి

నిభందనలు పాటించని టపాసు దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలి

కడప జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి వీరణాల.శివకుమార్

జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు;  రాబోవు దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలకు అధిక ధరలకు టపాసులు విక్రయించకుండా టపాసులు దుకాణాల పై నియంత్రించాలని నిభందనలు పాటించని టపాసులు దుకాణాల పై లైసెన్సులు రద్దు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ తెలిపారు.జమ్మలమడుగు లో స్థానిక ఎన్జీవో కార్యాలయం నందు పట్టణ కార్యదర్శి తులసిశ్వర్ యాదవ్ తో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ప్రజల వినోదాన్ని వ్యపారమ్యంగా చేసుకుని పట్టణంలో తపాసు దుకాణాల యాజమాన్యాలు సిండికేట్ గా ఏర్పడి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు అన్నారు.గతంలో ప్రతి ఏడాది ఇలాగే జరుగుతూ వస్తున్నది అన్నారు.నిభందనలు గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అన్నారు.ముఖ్యంగా ప్రజలు దుకాణాలకు కొనడానికి వస్తె కనీసం వారికి కొన్న వస్తువులకు బిల్లులు కూడా ఇవ్వడం వస్తున్నారు అన్నారు.అంతా జిరో బిజినెస్ చేస్తూ వస్తున్నారు అన్నారు.అలాగే ధరలు ఆకాశాన్ని అంటే విధంగా ప్రజలకు టపాసులు అమ్ముతున్నారు అన్నారు.టపాసులు కొనాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది అన్నారు.అంత ఖరీదు పెట్టీ కొన్నా అవి నాసిరకంగా అమ్ముతున్నారు అన్నారు.ఏడాది పాటు మిగిలిన సరుకులు నాణ్యత లేని టపాసులను ప్రజలు కు అమ్ముతున్నారు అన్నారు. టపాసుల దుకాణాల యాజమాన్యాలు ఇచ్చే వారికి ఇస్తున్నాం మమ్మల్ని ఎవరూ అడుగరు,ఏమి చర్యలు తీసుకోరు అని బహిరంగంగా చెబుతున్నారు అన్నారు.ఇప్పటికైనా రెవెన్యూ,పోలీసు,విద్యుత్ శాఖ ల అధికారులు గట్టి నిభందనలు పాటించే వారికే లైసెన్సులు ఇవ్వాలని నిభందనలు పాటించని దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని కోరుతున్నామన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!