ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్
నంద్యాల, న్యూస్ వెలుగు; అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్బంగా నంద్యాల పట్టణంలో సంజీవనగర్ గేట్ దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘణంగా నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ

మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ . ఈ సందర్బంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16 మద్రాసులో జన్మించారని ఈయన విద్యాభ్యాసం అంతా మద్రాసులోనే జరిగిందని. పొట్టి శ్రీరాములు గారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడుని తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు ,క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి యైన మహాపురుషుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆంధ్రులకు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. ఈయన 1952 డిసెంబర్ 15 న స్వర్గస్తులైనారన్నారు . ఈయన ఉద్యమ ఫలితంగా 1953 నవంబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని. ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులు ఎల్లవేళల స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి ఫరూక్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు , మున్సిపల్ సిబ్బంది , తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు , అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
Thanks for your feedback!