
రమణీయం శ్రీ పోతలింగేశ్వర స్వామి రథోత్సవం
Holagunda News Velugu : కర్నూలు జిల్లా హోలగుంద మండలం గేజ్జెహళ్లి గ్రామంలో శ్రీ పోతలింగేశ్వర స్వామి రథోత్సవం కనుల పండుగగా సాగింది.స్వామివారి సన్నిధిలో ఉదయం నుంచి జలభిషేకం, అభిషేకం,కుంకుమార్చన,గాంధాభిషేకం, ఆకుపూజ,హోమ పూజ వంటి విశేష పూజలతో పాటు పెద్ద ఎత్తున పూలమాలలతో స్వామివారిని అలంకరించారు. స్వామివారి జాత్ర సందర్భంగా దేవాలయాని పచ్చని తోరణాలు,రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.రథోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఉదయం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక నిర్వహించారు.సాయంత్రం ఉత్సవ విగ్రహ మూర్తులను రథోత్సవంలో ఉంచి బీరప్ప డొళ్ళు,మేళతాలతో ఊరేగింపుగా భక్తుల జయ జయ ధ్వనులు నడుమ రథోత్సవం ఎదురు బసవన్న గుడి వరకు ముందుకు సాగింది.రథోత్సవానికి ఆంధ్ర,కర్ణాటక రాష్ట్రల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.అదేవిధంగా నేడు లంకాదహనం,సోమవారం వసంతోత్సవంతో కార్యక్రమాలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు సర్పంచ్ ఆరుభట్లనాగమ్మ ఆధ్వర్యంలో.రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ దిలీప్ కుమార్ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.