దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలో ప్రోత్సహించాలి

దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలో ప్రోత్సహించాలి

న్యూస్ వెలుగు, కర్నూలు; వికలాంగులతో సమానంగా దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్లో ప్రోత్సహిస్తుందని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు  తెలిపారు. దివ్యాంగుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పారా స్పోర్ట్స్ ను జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం హర్షంచదగ్గ విషయమని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప తెలిపారు. ఈక్రీడలకు సంబంధించి వికలాంగుల కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన కర్నూలు లోని అవుట్ డోర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి విభిన్న ప్రతిభావంతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారని ఎల్లప్ప పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మొదటి బహుమతిగా 7 కోట్ల రూపాయలు,రెండో బహుమతి 5 కోట్లు, మూడో బహుమతి 3 కోట్ల నగదును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అందువల్ల దివ్యాంగులు ఈపోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఎల్లప్ప, మద్దిలేటి, సురేష్ నాయుడు, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!