అమ్మవారి పవిత్రోత్సవంలో పాల్గొన్న ఆలయ అధికారులు
విజయవాడ: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి పై నేటి నుంచి ఆఘస్ట్ 20 వరకు దేవస్థానంలో నిర్వహించు పవిత్రోత్సవములలో భాగముగా అదివారమ 18 శ్రీ అమ్మవారికి సుప్రభాతం, స్నపనాభిషేకం, అనంతరం ప్రాతః కాలార్చన నిర్వహించిన తదుపరి ఉదయం గం.09.00 ల నుండి భక్తులకు దర్శనము అనుమతించడం జరిగినదని ఆలయ అధికారులు వెల్లడించారు.
అనంతరం వైదిక కార్యక్రమములలో భాగంగా ఆదివారం ఆలయ కార్యనిర్వాహనాధికారి సమక్షంలో ఆలయ వైదిక సిబ్బంది, అర్చకులచే ఉ.09 గం.ల నుండి విగ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, అగ్నిప్రతిష్టాపన, సర్వప్రాయశ్చిత్త విధులు నిర్వహించి తదుపరి శ్రీ అమ్మవారు, స్వామివారు మరియు ఉపాలయములలోని దేవతలకు శాస్త్రోక్తంగా పవిత్ర మాలాధారణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహనాధికారి రామరావు దంపతులు, వైదిక కమిటీ సభ్యులు, వేదపండితులు, అర్చకులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.ఈ ముడు రోజులు దేవస్థానములో జరుగు అన్ని ఆర్జితసేవలు (ప్రత్యక్షము & పరోక్షము) నిలుపుదల చేయడమైనది. శ్రీ అమ్మవారికి నిర్వహించు అన్ని నిత్య కైంకర్యములను దేవస్థాన అర్చకులు మాత్రమే నిర్వహించెదరని ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనమునకు తరలివస్తున్నారు. ఉదయం 09 గం. ల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొనడం జరిగిందన్నారు.
ఈ సందర్బంగా(ఆదివారం రద్దీ) ఆలయ ఈవో సిబ్బందికి ముందస్తుగా ఆలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. కార్యాలయ సిబ్బంది ఆదివారం ప్రత్యేక విధులలో పాల్గొని భక్తుల రద్దీని క్రమబద్దీకరించడం జరిగిందన్నారు. ఈవో , ఆలయ అధికారులు భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా 11 గం. ల నుండి 01.30 గం. ల వరకు దేవస్థానం నందు ప్రోటోకాల్ దర్శనములు అన్ని నిలుపుదల చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.