దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు ముహూర్తం ఖరారు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో నేరణికి కొండ గుహలో వెలసిన దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవాలకు అర్చకులు రవిశాస్త్రి శుక్రవారం ముహూర్తం ఖరారు చేశారు.ఇందులో భాగంగా అక్టోబర్ 07వ తేదీన గణపతి పూజ,స్వామివారి కంకణధారణ,ధ్వజారోహణ,అక్టోబర్ 12వ తేదీన విజయదశమి(బన్నీ),మాళ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం,జైత్రయాత్ర,రక్షపడికి రక్త తర్పణం,శమి పూజ,13న ఆలయ పూజారిచే దైవవాణి,14న స్వామివారికి అభిషేకం, బండరార్చన, సాయంత్రం రథోత్సవం,15న గోరవయ్యల నృతోత్సవం, గొలుసు తెంపుట,దేవదాసి నృతోత్సవం, వసంతోత్సవం,సాయంత్రం కంకణ విసర్జన,16న ఉత్సవ మూర్తులు నేరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని నేరణికి, నేరణికి తండా,కొత్తపేట గ్రామ ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాల నరసింహులు, నేరణికి సర్పంచ్ తనయుడు సోమప్ప, రామ్ నాయక్,మల్లయ్య, తిమ్మయ్య,గాది గౌడ్,రామలింగ గౌడ,మల్లి తదితరులు పాల్గొన్నారు.