
విద్యారంగాన్ని కార్పోరేట్ శక్తులకు అప్పజెప్పే UGC ముసాయిదా నిబంధనలు తక్షణమే రద్దు చేయాలి
వైస్ ఛాన్సెలర్స్ నియామకం గవర్నర్లకు అప్పచెప్పే ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు: ఫెడరల్ హక్కులను కాలరాసే, ప్రభుత్వ యూనివర్శీటీలను మూసివేసే కుట్రలకుUGC తెరలేపిందని,వైస్ ఛాన్సలర్ లను గవర్నర్లకు కట్టబెట్టే నిర్ణయాని వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షులు సోమన్న అధ్యక్షతన ఏర్పాటు చేశారు. మాట్లాడుతూ భారత దేశ ఉన్నత విద్యారంగంలో ప్రమాదకరమైనదిగా ఈ ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. విద్యను మరింత కేంద్రీకరణ, కార్పోటీ కరణ, కాషాయకరణ చేసే దిశగా బీజేపీ పునుకుంటుందని అన్నారు. నూతన జాతీయ విద్య విధానం 2020 లో భాగంగా తీసుకొని వస్తున్నా ఈ ప్రతిపాదనలను ఫెడరిజం ప్రాథమీక సూత్రాలను ఉల్లంఘిస్తూ రాజ్యంగం మూల సూత్రాలను బలహీన పరిచే విధంగా ఈ
ప్రతిపాదనలు ఉన్నాయి అన్నారు. అదే కాకుండా విద్యలో రాష్ట్రల హక్కులను దెబ్బతీసి వారి స్వయంప్రతిపత్తిని అణిచివేస్తున్నాయన్నారు విద్యను బలవంతంగా కేంద్రికరించి భారత రాజ్యాంగలో ఉమ్మడి జాబితాల్లో ఉన్న విద్య UGC నిబంధనల ద్వారా కేంద్రం రాష్ట్రాల హక్కులను లాక్కుంటుందన్నారు. ఇ విద్య విధానాలను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర లలో ఇది బలవంతంగా అమలు చేసే కుట్రకు BJP తెరలేపింది అన్నారు.బిజెపి ప్రభుత్వం నిబంధనలతో ఇండియన్ నాలెడ్జి సిస్టమ్స్( ఐకేఎస్ ) ప్రమోట్ చేయలని పేరుతో రాష్ట్రల జాబితా లో విద్య ఉండడం అవసరం అనే దానికి ఉందాహరణ తమిళనాడు కేరళ రాష్ట్ర ల విద్య పై చేస్తున్న కృషి నిదర్శనం అన్నారు.రాష్ట్ర ల పై గవర్నర్తో విద్య వ్యవస్థ పై ఎంత దాడి జరుగుతుందో చూస్తున్నాం రాష్ట్రలు తమ ప్రత్యేక సామజిక రాజకీయ సాంస్కృతిక ఆర్ధిక అంశాలను అనుగుణంగా విద్య విధానాలను రూపొందిచుకోవడం ప్రాముఖ్యతను రాష్ట్రలను నొక్కి చెప్తున్నాయని,యూజీసీ ముసాయిదా పేరుతో తీసుకుంటున్న చర్యలు, పరిపాలన పరమైన సమస్య కాదని ఇది భారత రాజ్యాంగ నిర్మాణం పై దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశంలో విశ్వవిద్యాలయాల సైదాంతిక నియంత్రణ కార్పొరేట్ శక్తులు లాభదయాక సాధనగా హిందుత్వ ప్రచార సాధనలాగా మారకుండా ఉద్యమించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఉన్నత విద్యను పడుకునేందుకు విద్య వేతలు విద్యార్థులు యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు వ్యతిరేకంగా ఉద్యమించడానికి విద్యార్థులు సమయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షాబీర్ భాష, జిల్లా సహాయ కార్యదర్శులు శరత్ కుమార్, రంగస్వామి, థామస్,ఉపాధ్యక్షులు వీరేష్,దస్తగిరి, నగర అధ్యక్షులు అభి పాల్గొన్నారు