సంత జూటూరులో వరుస దొంగతనాలతో…. బెంబేలేత్తుతున్న గ్రామస్తులు…
నిద్రవస్థలో నిఘా నేత్రాలు
బండి ఆత్మకూరు న్యూస్ వెలుగు: బండి ఆత్మకూరు మండలంలోని సంత జూటూరు గ్రామంలో వరుస దొంగతనాలతో గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. గత పది రోజులు క్రిందట శివ వంకారేశ్వర ఫర్టిలైజర్ దుకాణం నందు అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దొంగ దుకాణం రేకును గొడ్డలితో నరికి లోనికి చొరబడి దొంగ కొంత నగదు ఎత్తుకెళ్లిన విషయం విధేయతమే. ఇది మరవక ముందే మంగళవారం అర్ధరాత్రి రామకృష్ణ చికెన్ సెంటర్లో చొరబడి ఎనిమిది గ్యాస్ సిలిండర్ను దొంగలించుకుని వెళ్లారు.ఈ సంఘటనలతో సంత జూటూరు గ్రామ ప్రజలు ఏ రోజు ఎక్కడ దొంగతనం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. దొంగతనాలు నియంత్రించడంలో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు గ్రామం లో పనిచేయకుండా నిద్రపోతున్నాయని ప్రజలు గ్రామస్తులు చెబుతున్నారు. నిఘా నేత్రాలపై పోలీసుల నిఘా తక్కువవడంతోనే సంత జూటుర్ గ్రామం దొంగలకు అడ్డాగా మారిందని ప్రజలు అంటున్నారు. 24 గంటలు పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసి నిఘా నేత్రాలను పనిచేసేలా చర్యలు తీసుకుంటే దొంగతనాలు నియంత్రించవచ్చని ప్రజలు చెబుతున్నారు. గ్రామాం లో పనిచేయని నిఘా నేత్రాలు తీసివేసి కొత్త వాటిని ఏర్పాటుచేసి ప్రత్యేక దృష్టిసారించాలని, అప్పుడే దొంగతనాలు నియంత్రించవచ్చు సంతజుటూరు గ్రామ ప్రజలు కోరుతున్నారు