
గ్రామ యువతకు క్వారీ నందు ఉపాధి కల్పించాలి
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని చిన్నహ్యట గ్రామంలోని క్వారి నందు గురువారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరయ్యారు.ముందుగా క్వారిని పరిశీలించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్
మాట్లాడుతూ క్వారీ నిర్వహణతో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.అలాగే క్వారీ చుట్టూ మొక్కలు నాటాలని తెలిపారు.గ్రామంలో క్వారీ నుంచి ఏ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు.అనంతరం ప్రజలు అధికారులతో మాట్లాడుతూ మన గ్రామానికి సబ్ కలెక్టర్ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.క్వారీ నుంచి దుమ్ము పంటల పై పడుతుందని దీంతో సంబంధిత క్వారీ యజమాని పంటకు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు.గ్రామానికి త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కావున దానిని కూడా పరిష్కరించాలన్నారు.అంతేకాకుండా గ్రామానికి చెందిన యువతకు క్వారీ నందు ఉపాధి కల్పించాలని కోరారు.గ్రామానికి అంబుల్స్ ఏర్పాటు చేయాలన్నారు.గ్రామం నుంచి వందవాగలికి వెళ్ళే రహదారికి తారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని విన్నపించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ హేసన్ వలి,ఎంపిటిసి శివన్న,తహసీల్దార్ ప్రసాద్ రాజ్,క్వారీ యజమాని శ్యామ్ చౌదరి,మైనింగ్ అధికారులు,గ్రామ ప్రజలు రామంజీని,రమేష్,చన్న బసవ,మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.