వారిపని దోచుకోవడం దాచుకోవమే : మంత్రి సవిత
శ్రీసత్యసాయి జిల్లా : పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం తురుకులాపట్నం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి సవిత అనంతరం తురుకులాపట్నం గ్రామం నుండి పెద్దిపల్లి గ్రామం వరకు సీసీ రోడ్ నిర్మానానికై 50 లక్షల రూపాయల నిధులతో భూమిపూజ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం లో దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి చేసింది శూన్యంమని ,గత ఐదు సంవత్సరాలు పరిస్థితులు చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ పాలన పట్ల విసుగు చెంది ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడవాలి అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలకు పూర్తి అధికారం అందించారని తెలిపారు.
ఎన్డీఏ ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చేదిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. అందులో భాగంగా మెగా డీఎస్సీతో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ, పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 100 పైగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారన్నారు. వైసిపి ప్రభుత్వం ప్రజలకు నిద్ర లేకుండా చేసిన “ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను” రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించమన్నారు. వృద్ధులకు అవ్వ తాతలకు పింఛన్లు ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు ఇవ్వడం అంతే కాకుండా ప్రతి నెలా ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గడిచిన వంద రోజులలో వరద బాధితులకు తక్షణమే ఆదుకునే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు 1,452 కోట్లు ఇచ్చి పంచాయతీ ల గ్రామాభివృద్ధి కి పరిశుభ్రతకు చేయూత నిచ్చామన్నారు. రొద్దం మండలంలో 73 పనులకు గాను 5 కోట్ల నిధులు తీసుకువచ్చాము.అదే విదంగా తురుకులాపట్నం గ్రామానికి 20 లక్షలు పెద్దిపల్లి 50 లక్షలు, కందుకూర్లపల్లి 1 కోటి 20 లక్షలు , కంబాలపల్లి పంచాయతీ 75 లక్షల రూపాయలు కొగిర మరియు పెడకోడిపల్లి చెరువుల మర మత్తులకు 60 లక్షల రూపాయలు ఇచ్చామని
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం లో మంజూరు అయ్యి నిలిచిపోయిన రొద్దం MJP స్కూల్ నిర్మాణానికి 25 కోట్ల నిధులు తీసుకొచ్చామని మంత్రి సవిత వెల్లడించారు.
పెనుకొండలో త్వరలోనే గార్మెంట్ పరిశ్రమ నెలకొల్పుతామని పెనుకొండలోని ప్రతి చెరువుకు సాగునీరు అందిస్తామని మంత్రి సవిత ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.