ప్రజలకు త్రాగునీరు అందించే ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకూడదు
ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
హోళగుంద,న్యూస్ వెలుగు: ప్రజలకు త్రాగునీరు అందించే ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలకూడదని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు.మంగళవారం మండల పరిధిలోని సమ్మెతగేరి గ్రామంలో ఉన్న త్రాగునీటి సంబంధించిన సిపిడబ్ల్యూఎస్ హెడ్ వర్క్స్ సంబంధించిన స్థలం ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సమ్మెతగేరి సిపిడబ్ల్యూఎస్ పరిధిలో ఉన్న సమ్మెతగేరి,ముగుమానగుంది, ఎల్లార్తి,బి.జి హాళ్లి,పెద్దహ్యాట , చిన్న హ్యాట,కోగిలతోట గ్రామాలలో త్రాగునీటి పంపిణి ప్రక్రియలో ఏటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాలలో పర్యవేక్షణ చేయాలన్నారు.ముఖ్యంగా ఏదైనా అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన సమస్యలు ఉంటే ఉన్నత అధికారులతో నివృత్తి చేసుకొని సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.అనంతరం పెద్ద హ్యాట,ఎల్లార్తి గ్రామాల్లో పర్యటించి గ్రామ ప్రజలతో త్రాగునీటి సమస్యలపై సమీక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మజ, తహశీల్దార్ సతీష్,డిప్యూటీ ఇంజనీర్ మల్లికార్జున,ఏ.ఈ రామ్ లీలా,చేతన్ ప్రియ తదితరులు పాల్గొన్నారు.