
ఇది ముప్పైఏళ్ల మాదిగల పోరాటం : కాంగ్రెస్
నంద్యాల (డోన్ ): 30 ఏళ్ళ మాదిగల సుదీర్ఘ పోరాటానికి దక్కిన ఫలితం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చినందని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి మంద కృష్ణ మాదిగ కు అభినందనలు తెలిపారు. ముప్పై ఏళ్లుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తుచేశారు. సమాజంలో మాదిగలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎండకట్టరాని వారు అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడిందని,కొన్ని కులాల్లో వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని, ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు వెలువరించడం,విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించడం సంతోషమని వారు అన్నారు.


 DESK TEAM
 DESK TEAM