ఇది ముఖ్యమంత్రి పరిస్కార వేధిక : ఆర్థిక మంత్రి

మడకశిర, జూలై 30: ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మడకశిర నియోజకవర్గంలోని గుండుమల గ్రామసభ కార్యక్రమాలలో ఆగస్టు ఒకటో తేదీన ముఖ్యమంత్రి పాల్గొననున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముందస్తుగా  హెలిపాడ్, ముఖ్యమంత్రి పాల్గొన్న ప్రదేశాలను మంగళవారం రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు మాట్లాడుతూ ప్రతి నెల 1 తేదీన జిల్లాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పాల్గొని, గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. గ్రామ సమస్యలు పరిష్కరించడానికి ప్రజా వేదిక నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆయా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి వేదిక ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాత్ర ఎక్కువగా ఉంటుందని, గ్రామాల మధ్యలో, బడి పక్కన, గుడి ప్రక్కను, ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, స్థానిక మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పే స్వామి , సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ వి రత్న, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!