
కురువ ఈరన్నను హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు: కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కురువ బండారు ఈరన్నను వేట కొడవళ్లతో దారుణంగా నరికిచంపిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని జాతీయ సంగోళి రాయన్నసేన అధ్యక్షులు బత్తిన కిరణ్ కుమార్, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,జిల్లా గొర్రెల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు, మదాసికురువ,మదారి కురువ,కురువ సంఘాల జిల్లా జనరల్ సెక్రెటరీ కురువ మహేంద్ర, మదాసికురువ రాష్ట్ర అధ్యక్షులు తిరుమలేష్, మాజీ జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్,కురువ వెంకటరాముడు, దళిత రత్న అవార్డు గ్రహీత శివయ్య, కేడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బండారు శ్రీనివాసులు, మాదాసి కురువ సంక్షేమ సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీ శివలింగం మదారికురువ లు డిమాండ్ చేసారు.
కర్నూలు నగరంలో బళ్లారి చౌరస్తాలో గల జాతీయ సంగోళి రాయన్నసేన కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఆలూరు మండలం అరికెర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కురువ బండారు ఈరన్నను కొందరు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా దిగిపోవాలని గత కొంతకాలంగా బెదిరింపులకు దిగారని ఈరన్నను గ్రామపజలంతా ఫీల్డ్ అసిస్టెంట్ గా కొనసాగాలని కోరడంతో ఆయన యదావిధిగా విధులకు వెలుతున్న సమయంలో కొందరు వ్యక్తులు దారిమధ్యలో కాపుకాసీ వేటకొడవళ్లతో అత్యంత దారుణంగా నరికి చంపారని అన్నారు.
అలాగే వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కురువలు అధికసంఖ్యలో ఉన్నరని సౌమ్యులుగా పేరున్న కురువలపై దాడులు,హత్యలు జరగడం బాధాకరమని నిందుతులు ఎంతటివారైనా ప్రభుత్వం, పోలీసుశాఖ వారిని కఠినంగా శిక్షించాలని నిందితులకు రాజకీయ అండదండలు ఇచ్చిన నాయకులకు పార్టీలు తమపార్టీలనుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే కురువ బండారు ఈరన్న కుటుంబానికి పర్మినెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం, ప్రభుత్వం తరపున కుటుంబానికి 50లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ కురువ సంఘాల నాయకులు లక్ష్మీపురం జాతీయ సంగ్గోలి రాయన్న కర్నూలు జిల్లా జనరల్ సెక్రెటరీ మురళి మోహన్,తడకనపల్లె లాలు,పెద్దపాడు శివనారాయణ,పందిపాడు శివశంకర్, పెదపాడు చంద్ర శేఖర్
లక్ష్మణ లక్ష్మీనారాయణ కులస్తులు వేతన పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.