ఉత్తరప్రదేశ్ లో భారీ వరదలు నీటమునిగిన వేల ఇల్లు

ఉత్తరప్రదేశ్ లో భారీ వరదలు నీటమునిగిన వేల ఇల్లు

ఉత్తరప్రదేశ్‌  (న్యూస్ వెలుగు  ): ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, మధుర వంటి జిల్లాల్లో వరద పరిస్థితి భయంకరంగా  ఉందని స్తానికిలు తెలిపారు . యమునా నది నీటితో మధుర అత్యంత దెబ్బతినగా  ఇక్కడ అనేక నివాస ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేనట్లు అధికారులు తెలిపారు. మధురలో  5,000 మంది ప్రజలు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు తెలుపగా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రసిద్ధ బాంకే బిహారీ ఆలయానికి వెళ్లే రహదారి పూర్తిగా నీటిలో మునిగిపోగా … ఆగ్రాలో కూడా, యమునా నది నీరు తాజ్ మహల్ ప్రాంగణంలోకి ప్రవేశించి, ఇతర లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిందని అధికారులు తెలిపారు. మరోవైపు, ప్రయాగ్‌రాజ్ జిల్లా కూడా వరద ఉధృతిలో మునిగిపోయింది, ఇక్కడ గంగా మరియు యమునా నదుల నీరు నగరంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తాయి.

Author

Was this helpful?

Thanks for your feedback!