ముగ్గురు దొంగలు అరెస్టు
28 తులాల బంగారం రికవరీ
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూల్ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు కర్నూల్ డిఎస్పీ జె. బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూల్ నాల్గవ పట్టణ సిఐ మధుసూధన్ గౌడ్ మరియు ఎస్సై లు గోపీనాథ్, చంద్ర శేఖర్ లు 4 వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు దొంగతనాల కేసులలో నిందితులుగా ఉన్న వంశీనాథ్, బాలు, హనుమంతు అను ముగ్గరు ముద్దాయిలు ను అరెస్టు చేసి వారి వద్ద నుండి 28 తులాల బంగారం స్వాదీనం చేసుకున్నారు.
వీరిలో హనుమంతు అంతరాష్ట్ర దొంగ , ఇతని మీద కర్ణాటక రాష్ట్రం లో పలు పిఎస్ లలోని దొంగతనం కేసులలో అరెస్టు చేశారు.
ముద్దాయిలు జల్సాలకు , జూదానికి, వ్యభిచారానికి అలవాటు పడి దొంగ తనాలు చేస్తున్నట్లు దర్యాప్తు లో తెలిసింది. ఇంటి యజమానులు , ఇంటికి తలుపులు వేసి వెళ్ళినప్పుడు విలువైన వస్తువులు బంగారు డబ్బు ఇంట్లో ఉంచరాదని , సిసి కెమెరాలు మరియు వాచ్ మెన్ లను ఏర్పాటు చేసుకోవాలని, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఈ సంధర్బంగా కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ గారు సూచించారు. ముద్దాయిలను పట్టుకోవడం రికవరీ లో కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. పోలీసు సిబ్బందికి కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్ రివార్డులు అందజేశారు.