వెంటనే టిడ్కో గృహాలు పంపిణీ చేయాలి

వెంటనే టిడ్కో గృహాలు పంపిణీ చేయాలి

జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు గుడం చెరువు రాజీవ్ కాలనీ . ప్రాంతంలో నిర్మించిన టిడ్కో ఇండ్లను వెంటనే.లబ్ధిదారులకు కేటాయించాలని.సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు సెప్టెంబర్ 15 అనగా  ఆదివారం  రాజీవ్ కాలనీ ప్రాంతంలో నిర్మించిన కిడ్కో అపార్ట్మెంట్స్ ను. జమ్మలమడుగు సిపిఎం పార్టీ కార్యదర్శి జి.ఏసుదాసు. సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు దాసరి విజయ్ లు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2015 టిడిపి ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటిని నిర్మించి ఇవ్వాలన్న అప్పటి. ప్రస్తుతం.ఏపీ. ముఖ్యమంత్రి  దృఢ సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగాతో పాటు మన జమ్మలమడుగు గూడెం చెరువు. ప్రాంతంలో కూడా 1440 ఇండ్లకు గాను 1404 ఇండ్లు. 2018 చివరి కల్లా కొద్దిపాటి పనులు పెండింగ్ తో పూర్తి అయ్యాయి. ఇంతలోనే 2019 ఎలక్షన్ల టైం రావడంతో. పేదవారికి సొంత ఇంటి కల. కలగానే మిగిలిపోయిందని వారు విచారణ వ్యక్తం చేశారు. (ఏపీ టిడ్కో) ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వైసిపి ప్రభుత్వంలోనైనా. ఇల్లు వస్తాయిలే అని డబ్బులు కట్టి అర్జీలు పెట్టుకున్న పేదా మహిళలు. సంబంధిత అధికారుల ఆఫీసుల చుట్టూ తిరిగిన అధికారులు స్పందించకపోగా పై పెచ్చు మహిళల పట్ల దురుసుగా మాట్లాడి బెదిరిస్తున్నారని. పై స్థాయి సంబంధిత అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకో కపోవడంతో చేసేదేమీ లేక అర్జీదారులు సైలెంట్ అయ్యారని వారు గుర్తు చేశారు. ప్రస్తుతము టిడ్కో ప్రాంతమంతా ముళ్లపదలు పిచ్చి మొక్కలతో చిన్నపాటి అడవిని తలపించేలా ఉందని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఇక్కడున్న పిచ్చి మొక్కలన్నిటినీ తొలగించాలన్నారు. ప్రభుత్వ ధనంతో పేద ప్రజల కోసం ఎంతో టెక్నాలజీతో నిర్మించిన టిడ్కో ఇండ్లకు కరెంటు. మంచినీటి పైప్ లైన్ కనెక్షన్లు.డ్రైనేజీ వ్యవస్థను వెంటనే నిర్మించి. ప్రజలు ఆగ్రహించక ముందే లబ్ధిదారులకు అందించాలని  డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం లాగానే. కూటమి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తే. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తిరుగుబాటు తప్పదని  సూచించారుకార్యక్రమంలో వినయ్. భాష పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!