కర్నూల్ జిల్లా LLC ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన టిప్పుసుల్తాన్
మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి
PC చైర్మన్ పదివి రావడానికి సహకరించిన ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు నూతన llc pc అధ్యక్షులు టిప్పు సుల్తాన్
హొళగుంద, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా జలమండి జల మండల ఆఫీసులో శనివారం తుంగభద్ర డాం దిగువ కాలువ ప్రాజెక్టు కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన కౌతలం మండల సీనియర్ నాయకులు చందాఖాన్ గారి కుమారులు టిప్పు సుల్తాన్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన మంత్రాలయం నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ అని రాఘవేంద్ర రెడ్డి , అనంతరం టిప్పు సుల్తాన్ మాట్లాడుతూ నాకు ఈ పదివి ఇప్పించిన ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారికి అలాగే నన్ను నా 40 సంవత్సరాల రాజకీయాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కి మినిస్టర్ లోకేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మాట్లాడటం జరిగింది. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ నా నిర్ణయాన్ని గౌరవించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. మోన్న ఇచ్చిన నామినేటెడ్ పోస్టుల్లో నా మంత్రాలయనికి ఒక పోస్ట్ రాలేదని కానీ ఇప్పుడు ఈ అధ్యక్షుల పదవి వలన ఆ లోటు తీరిందని ఆనందభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో కౌతాళం మండల నాయకులు సతీష్ నాయుడు ,సురేష్ నాయుడు , వెంకటపతి రాజు , అడిదప్ప గౌడ్ , కోసిగి మండల నాయకులు ముత్తురెడ్డి , తోవి రామకృష్ణ , మంత్రాలయం మండల నాయకులు మాజీ జడ్పీటీసీ ఆర్.లక్ష్మయ్య , కూటం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.