నేటి నుండి తిరుపతి దేవస్థానం వారి ధార్మిక కార్యక్రమాలు; ఈఓ వీరయ్య
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలసిన శ్రీ భూదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీరంగనాథ స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహనాధికారి వీరయ్య తెలిపారు.సోమవారం ఆయన మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు డా.దేవిదయానంద్ సింగ్ శ్రీ మద్రామాయణం పై ఉపన్యాసం చేస్తారన్నారు.అనంతరం స్థానిక భజన బృందం వారిచే భజన కార్యక్రమం ఉంటుందన్నారు.బుధవారం సాయంత్రం ఆరు గంటలకు డా.దేవిదయానంద్ సింగ్ శ్రీ మహాభారతంపై ఉపన్యాసం చేస్తారన్నారు.అనంతరం స్థానిక భజన బృందం వారిచే భజన కార్యక్రమం ఉంటుందన్నారు.గురువారం సాయంత్రం ఆరు గంటలకు డా.దేవిదయానంద్ సింగ్ శ్రీ మద్భగవద్గీతపై ఉపన్యాసం చేస్తారన్నారు.అనంతరం స్థానిక భజన బృందం వారిచే భజన కార్యక్రమం ఉంటుందన్నారు.శుక్రవారం ఉదయం పది గంటలకు స్థానిక మహిళలచే గోపూజ కార్యక్రమం,సాయంత్రం ఆరు గంటలకు డా.మల్లు వెంకటరెడ్డి ఉపన్యాసం చేస్తారని,స్థానిక భజన బృందం వారిచే భజన కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు.కావున భక్తులు,గ్రామప్రజలు ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని శ్రీ పెరవలి రంగనాథ స్వామి దేవస్థాన కారనిర్వహణాధికారి వీరయ్య తెలియజేశారు.