నేడు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
హోళగుంద, న్యూస్ వెలుగు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు నేడు మండల కేంద్రంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంద టీడీపి శ్రేణులు పాత్రికేయులకు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు తాలూక తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వీరభద్రగౌడ్ హాజరవుతున్నట్లు తెలిపారు.అంతేకాకుండా వాల్మీకి సర్కల్ నుండి తేరుబజార్ లోని మురళి రైస్ మిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు.కావున కార్యక్రమానికి చుట్టూ పక్కల గ్రామాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,జనసేన,బీజేపీ,ఐటీడీపి,టీఎన్ఎస్ఎఫ్,తెలుగుయువత,క్లస్టర్,యూనిటీ,బూత్ ఇంచార్జ్ లు పెద్ద ఎత్తున్న పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!