
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు
కర్నూలు జిల్లా ఇంచార్జ్ ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్
కర్నూలు, న్యూస్ వెలుగు; పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య సామర్ధ్య పరీక్షల బందోబస్తు విధులలో పోలీసు అధికారులు ఉన్న కారణంగా సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమము” రద్దు చేసినట్లు కర్నూలు జిల్లా ఇంచార్జ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం” కు రావద్దని కర్నూల్ జిల్లా ఇంచార్జ్ ఎస్పీ తెలిపారు .
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar