ఆవుల బెడదతో బస్టాండ్ లో ట్రాఫిక్ సమస్య
నిర్లక్ష్యం వహిస్తున్న మూగ జీవాల యజమానులు, పోలీసు వ్యవస్థ
అవస్థలు పడుకతున్న వాహన చోదకులు
న్యూస్ వెలుగు,ఒంటిమిట్ట; మండల కేంద్రమైన ఒంటిమిట్ట మెయిన్ బస్టాండ్ రహదారిలో రాత్రి పగలు అనే తేడా లేకుండా అనునిత్యం ఆవుల మంద కొలువై ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్నాయంటూ వాహన చోదకులంటున్నారు. ఒంటి మిట్ట కడప చెన్నై ప్రధాన రహదారిలో ఉండడంతో అంతేకాక ఆంధ్ర భద్రాచలంగా పేరొందిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం కొలువై ఉండడం చేత స్వామివారి దర్శనార్థం పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు వాహనాలలో ఒంటిమిట్టకు తరలివస్తున్న నేపథ్యంలో ఒంటిమిట్ట మెయిన్ బస్టాండు అధిక జనసాంద్రతతో, వాహనాల రాకపోకలతో కిక్కిరిసిపోతుంది. ప్రధాన విషయానికొస్తే ఆవుల మంద ప్రధాన రహదారిలోనే అటు ఇటు తిరుగుతున్న నేపథ్యంలో మూగ జీవాలను తప్పించబోయి వాహన ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయని పలువురు అంటున్నారు. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఆవుల యజమానులు తమ ఆవులను నిర్లక్ష్యంగా రోడ్ల మీదికి వదిలిపెట్టినందువల్ల తరచూ జరిగే వాహన ప్రమాదాలకు పరోక్షంగా కారణభూతమవుతున్నారని బస్టాండ్ లో ట్రాఫిక్ సమస్య వ్యవహారం స్థానిక పోలీసులకు ప్రత్యక్షంగా తెలిసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆంతర్యం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కనీసం బాధ్యత కలిగిన పోలీసులుగా ఉండి దేని వలన ట్రాఫిక్ సమస్య తెలిసి కూడా ఆవుల యజమానులు ఎవరో కనుక్కొని పోలీస్ స్టేషన్కు పిలిపించి మందలించిన పాపాన పోలేదని వాహనదారులు, యజమానులు అంటున్నారు. పెద్ద పెద్ద ప్రమాదాలు సంభవించక ముందే స్థానిక పోలీసులు వెంటనే ఆవుల యజమానులపై కఠినంగా వ్యవహరించి తమ ఆవులను ఇళ్లకు తోలుకొని పోయే విధంగా చర్యలు తీసుకుని ఒంటిమిట్ట బస్టాండులో ట్రాఫిక్ సమస్యను నియంత్రించి కోదండరామస్వామి దర్శనార్థం వస్తున్న భక్తులకు ప్రధాన రహదారిలో తిరిగే వాహన చోదకులకు తమ వంతు సహాయ సహకారాలు అందించి జరిగే ప్రమాదాలను నివారించి చేదోడు వాదోడుగా ఉండి గ్రామస్తుల మన్ననలు పొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అంటున్నారు.