
విషాదం.. పిడుగుపడి ముగ్గురు కూలీలు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
అమరావతి : ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు గ్రామంలో పొలం పనులకు వెళ్లిన కూలీలు ముగ్గురు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో ఆరుగురు కూలీలు చెట్టు వద్దకు వచ్చి నిలబడ్డారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడి ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ కూలీలను స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Was this helpful?
Thanks for your feedback!