
అంగన్వాడి టీచర్లకు శిక్షణ కార్యక్రమం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని రెండు సెంటర్లు లో హోళగుంద హెబ్బటం గ్రామంలో మంగళవారం 49 అంగన్వాడి కార్యకర్తలకు సర్టిఫికెట్ కోర్సు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి జగన్నాథ్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగన్న,సూపర్ వైజర్ శిబా రాణి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 0-3 సంవత్సరాలు మరియు 3-5 సంవత్సరాల విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధి పై శిక్షణ కార్యక్రమం మూడు రోజులు పాటు నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్త పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!