ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

  అమరావతి; ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌గా శ్రీధర్‌ను బదిలీ చేసింది. ఆయన 2009 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఆయన సీఆర్డీఏ కమిషనర్‌గా పని చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ లక్ష్మీ షా బదిలీ చేశారు. ఆమె 2013 ఐఏఎస్‌ అధికారి. ఇంతకు ముందు ఆయన ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా కొనసాగారు. ఇక ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా 2015 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అభిషిక్త కిషోర్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Author

Was this helpful?

0/400
Thanks for your feedback!

COMMENTS