ప్రతి ఉద్యోగికు బదిలీలు సహజమే… తహసీల్దార్ నాగరాజు

ప్రతి ఉద్యోగికు బదిలీలు సహజమే… తహసీల్దార్ నాగరాజు

బదిలీపై వెళ్తున్న మండల సర్వేయర్ గాది లింగప్ప కు  ఘన సన్మానం

తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: ప్రభుత్వ కార్యాలయాలలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి బదిలీలు సహజమేనని తుగ్గలి మండల తహసిల్దార్ నాగరాజు తెలియజేశారు.గురువారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలో గల స్థానిక తహసిల్దార్ కార్యాలయం నందు సాధారణ బదిలీపై వెళ్తున్న మండల సర్వేయర్ గాది లింగప్పను మండల రెవెన్యూ అధికారులు శాలువాను కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీత గాదిలింగప్పను ఉద్దేశించి రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ సర్వే యందు 29 ఉంది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన మండల సర్వేయర్ గాదిలింగప్ప బదిలీ కావడం బాధాకరమని,ఆయన ద్వారా సర్వేలో ఎన్నో విషయాలను తెలుసుకున్నామని వారు తెలియజేశారు.ప్రభుత్వం చేపట్టిన రిసర్వేలో ఎన్నో కఠినమైన సమస్యలను కూడా సునాయాసంగా పరిష్కరించారని వారు తెలియజేశారు.రైతులకు సంబంధించిన మరియు అన్నదమ్ములకు సంబంధించిన పొలం సమస్యలను ఎన్నో పరిష్కరించారని వారు తెలియజేశారు.ఈ సందర్భంగా విలేజ్ సర్వేయర్లు మాట్లాడుతూ ఎటువంటి అనుభవం లేని సర్వే పట్ల మొదటి పాఠాలు నేర్పారని వారు తెలియజేశారు.ప్రభుత్వ రీసర్వే నందు వెన్నుదండుగా ఉండి తమ సమస్యలను పరిష్కరించారని వారు తెలియజేశారు. ఆయన ద్వారా రీసర్వే నందు ఎన్నో కఠిన సమస్యలను పరిష్కరించామని వారు తెలియజేశారు.అదేవిధంగా రాతన నుండి పత్తికొండ మండలానికి బదిలీ అవుతున్న విలేజ్ సర్వేయర్ రాజు నాయక్ కూడ తోటి విలేజ్ సర్వేయర్లు ఘనంగా సన్మానించారు. చివరిగా తుగ్గలి మండలానికి సంబంధించిన విలేజ్ సర్వేయర్లు గజమాలతో మండల సర్వేయర్ గాదిలింగప్పను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాముడు, జూనియర్ అసిస్టెంట్ అబ్దుల్లా,తుగ్గలి మండల విఆర్ఓ లు రహిమాన్, రంగప్ప,రంగన్న,స్వరూప్,భార్గవ్, శ్రీనివాసులు,గోవిందప్ప,రామలింగప్ప రామాంజనేయులు,తుగ్గలి మండల విలేజ్ సర్వేయర్లు రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్,విశ్వనాథ్,బాబా సాహెబ్, శివుడు నాయక్,సాయికుమార్,సురేష్, రాజు,కృష్ణ నాయక్,వేణు గోపాల్, యుగంధర్ నాయక్,లోకేశ్వర్ నాయక్, గిరి బాబు,బాను ప్రకాష్,రాజేశ్వరి మండల విఆర్ఏలు,మండల డీలర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!