విలువలతో కూడిక వైద్యం చేయండి

విలువలతో కూడిక వైద్యం చేయండి

న్యూస్ వెలుగు, కర్నూలు; మెడికల్ కాలేజ్..కర్నూలు.విలువలతో కూడిన వైద్యం చేయండి అని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ , కె.యం.సి ప్రిన్సిపల్ డా.చిట్టి నరసమ్మ అన్నారు . శనివారం మెడికల్ కాలేజ్ లోని లెక్చర్ గ్యాలరీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లకి యన్.యం.సి నిబంధనల మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ కోఆర్డినేటర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్స్ సింధియా శుభప్రద ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ తరగతులు ముగింపు సందర్భంగా హాజరైన ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వైద్యులు తమ వైద్యం లో ప్రతి పనికి రికార్డు మెయింటెయిన్ చేయాలని ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు రికార్డులు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు. సర్వజన వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ . కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్యులు రోగులు ఎడల సింపతి చూపించడం కాదని యంపతి చూపాలని, రోగులు డాక్టర్ పై ఎంతో నమ్మకంతో తమ సమస్యలు చెప్పు కుంటారని వాటిని సావధానంగా వినాలని, ప్రతి వైద్యుడు ఎన్.ఎం. సి నిబంధనలను తప్పకుండా పాటించాలని అప్పుడే వైద్యులకు సమాజం లో గౌరవం, రక్షణ ఉంటుందని తెలిపారు. ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో గుడ్ క్లినికల్ మరియు లేబరేటరీ ప్రాక్టీసెస్ , ఎథిక్స్ గురించి కార్డియో ధోరాసిక్ సర్జరీ, ఫోరెన్సిక్ మీడిషన్, ఫార్మా కాలజీ, పథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ కమ్యూనిటీ మెడిసిన్ విభాగపు వైద్యులు పి.జి వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!