భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కు ఘన నివాళులు

భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కు ఘన నివాళులు

బండి ఆత్మకూర్ , న్యూస్ వెలుగు;  మండలంలోని ఏ కోడూరు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వర్ధంతి వేడుకలను సర్పంచ్ జ్ఞానభరణం రిటైర్డ్ ఆర్మీ సైనికుడు నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్కూల్ పిల్లలకు పుస్తకాలు పెన్నులు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అని ఆయన రచించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శనీయమన్నారు. సమాజంలో అణగారిన పేద వెనుకబడిన వర్గాలకు సామూహిక రక్షణ కల్పించిన మహౌన్నత వ్యక్తి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు నాయకుడు డేవిడ్ విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!