కేబినెట్ సెక్రటరీగా టీవీ సోమనాథన్ నియామకం

కేబినెట్ సెక్రటరీగా టీవీ సోమనాథన్ నియామకం

Delhi (డిల్లీ) : కేబినెట్ సెక్రటరీగా టీవీ సోమనాథన్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ శనివారం ఆమోదం తెలిపింది. సోమనాథన్ ఆగస్టు 30వ తేదీ నుండి రెండేళ్ల పదవీ కాలానికి నియమితులయ్యారు. అతను తమిళనాడు కేడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) 1987 బ్యాచ్‌కి చెందిన అధికారిగా తెలిపారు. కేబినెట్ సెక్రటేరియట్‌లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా సోమనాథన్ నియామకాన్ని కూడా కమిటీ ఆమోదించింది. ఈ నియామకం ఆయన  చేరిన తేదీ నుండి ప్రారంభమై క్యాబినెట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించే వరకు కొనసాగుతుందని అధికారికంగా తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS