ఏపీలో ఉచిత సిలిండర్‌పై ట్విస్ట్.. డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో తిరిగి చెల్లింపునకు కేబినెట్ ఆమోదం
అమరావతి : ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యంగా ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వం మహిళలకు ఉచిత సిలిండర్లను కానుకగా ప్రకటించింది. ఏడాదికి మూడు సిలిండర్లను ఒకే సారి కాకుండా నాలుగు నెలలకు ఒకటి చొప్పున అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే సిలిండర్‌కు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో తిరిగి వారి ఖాతాల్లో వేయాలని నిర్ణయించారు.
. అదేవిధంగా ఉచిత ఇసుకపై జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జ్ మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుక సరిగా అమలయ్యేలా చూడాలని, ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని సూచించారు. ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించాలని, ఆలయ కమిటీల్లో సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. శారదా పీఠం భూకేటాయింపుల రద్దుకు ఆమోదం ప్రకటించింది. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల్లో అక్రమాలపై చర్యలకు కమిటీ వేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.