యూనివర్శిటీలో రెండు రోజుల జాతీయ సదస్సు

యూనివర్శిటీలో రెండు రోజుల జాతీయ సదస్సు

డిగ్రీ తో పాటు సివిల్స్ చదవాలనుకునే వారికి బి ఎ పబ్లిక్ పాలసీ,ఎమ్ ఎ పబ్లిక్ పాలసీ తో సాధ్యం

అమరావతిని సివిల్ సర్వీస్ హబ్ గా మారుస్తున్న “తక్షశిల ఐ ఎ ఎస్ అకాడమీ”

అమరావతి కేంద్రబిందువుగా తక్షశిల ఐఏఎస్ అకాడమీ సేవలు

 గుంటూరు న్యూస్ వెలుగు : అమరావతి ని సివిల్ సర్వీస్ హబ్ గా మార్చాలనే ఏకైక లక్ష్యంతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమన్వయంతో తక్షశిల ఐ ఎ ఎస్ అకాడమీ కృషి చేస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ లక్ష్యసాధనలో భాగంగానే రెండు రోజుల జాతీయ సదస్సును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.ఈ జాతీయ సదస్సుకు  ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి చెందిన  ఐ పి ఎస్ కె చక్రవర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జాతీయస్థాయిలో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీతోపాటు సివిల్స్ సర్వీస్ కు సిద్ధం అవ్వాలనుకునే వారికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో అందిస్తున్న బి ఏ ,ఎమ్ ఎ పబ్లిక్ పాలసీ అత్యద్భుతం గా ఉందని చెప్పారు. విద్యార్థినీ విద్యార్థులకు తాము అనుకున్న లక్ష్యాలను సాధించడం కోసం కష్టపడాలని, పోటీ పరీక్షలలో తగిన మెలకువలతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. విద్యార్థులకు తన స్వీయ అనుభవాలతో
ఏ విధంగా కష్టపడాలో స్ఫూర్తిదాయకమైన రీతిలో ప్రసంగించారు. మరో ప్రత్యేక అతిధి రాష్ట్ర పూర్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ విఎన్ విష్ణు ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థినీ విద్యార్థులకు దేశంలోని ఎన్నికల విధానం పై సుధీర్గ ఉపన్యాసం అందించారు. తక్షశిల ఐఏఎస్ అకాడమీ సేవలు మరింత విస్తృతం అవ్వాలని, బిఏ పబ్లిక్ పాలసీ వంటి కోర్సులను సివిల్స్ కు అనుగుణంగా వర్సిటీలో ఏర్పాటు చేయడం పై హర్షంవ్యక్తం చేశారు. ఈ జాతీయ సదస్సుకు ఆర్ట్స్ కామర్స్ లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎమ్ సురేష్ కుమార్ సభాధ్యక్షత వహించారు. ఈ జాతీయ సదస్సులో వర్సిటీ తాత్కాలిక వీసీ కంచర్ల గంగాధరరావు, రిజిస్ట్రార్ జి సింహాచలం,పాల్గొని విద్యార్థినీ విద్యార్థులు తగిన రీతిలో సేవలు వినియోగించుకోవాలని అన్నారు. జాతీయస్థాయిలో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీతోపాటు సివిల్స్ సర్వీస్ కు సిద్ధం అవ్వాలనుకునే వారికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో అందిస్తున్న బి ఏ ,ఎమ్ ఎ పబ్లిక్ పాలసీ అత్యద్భుతం గా ఉందని చెప్పారు.ఈ విధంగా తక్షశిల సేవలు ఎంతో బాగున్నాయని కొనియాడారు.ఈ సదస్సుకు ఆచార్య బట్టు నాగరాజు సంచాలకులుగా వ్యవహరించారు. ఈ సదస్సులో విద్యార్థినీ విద్యార్థులు ,అధ్యాపకులు,తదితరులు  పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!