రెండు రోజులు “పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు

రెండు రోజులు “పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు

    ఏపీవో హేమ సుందర్

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం నందు పలు గ్రామపంచాయతీలలో జనవరి 10,11 వ తేదీలలో “పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు”కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుగ్గలి మండల ఏపీవో హేమ సుందర్ తెలియజేశారు. గురువారం రోజున ఉపాధి కార్యాలయం నందు విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీల నందు జరిగే మినీ గోకులం,సిసి రోడ్లు మరియు కాలువల ప్రారంభ మహోత్సవ కార్యక్రమానికి గ్రామపంచాయతీలోని గల పెద్దలు,ప్రజా ప్రతినిధులు,మండల స్థాయి అధికారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలియజేశారు.10వ తేదీన జొన్నగిరి, రాంపల్లి,కడమకుంట్ల,వైజి తాండ,శభాష్ పురం,ముక్కెళ్ల,ఎద్దుల దొడ్డి గ్రామపంచాయతీల నందు మరియు 11వ తేదీన గిరిగెట్ల,గుత్తి ఎర్రగుడి,సిజి తాండ,చెన్నంపల్లి,పగిడిరాయి గ్రామపంచాయతీలు నందు అభివృద్ధి పనుల ప్రారంభ మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామపంచాయతీలోని గల గ్రామ పెద్దలు,ప్రజా ప్రతినిధులు,మండల స్థాయి అధికారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీఓ హేమ సుందర్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఈసీ ప్రదీప్,టి.ఏ లు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!