
పోలీస్ అమరులను స్మరించుకొని రక్తదానం చేసిన టూ టౌన్ సిఐ యుగంధర్
పొద్దుటూరు టౌన్, న్యూస్ వెలుగు; పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా స్థానిక పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్తదానo శిబిరం నిర్వహించడం జరిగింది.
టూ టౌన్ సిఐ యుగంధర్ రక్తదానం చేయడం జరిగింది.విధులు నిర్వహణలో భాగంగా అమరులైన రక్షకభటులు వారిని స్మరించుకొని రక్తదానం చేయడం జరిగింది. పొద్దుటూరు పట్టణంలో ప్రజలకు మా పోలీసు వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం డేవిడ్ రాజ్, భగత్ సింగ్ బ్లడ్ డొనేట్ గ్రూప్ కార్యదర్శి ఓబులేసు, ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర్, డాక్టర్స్ గోపాల్, దిలీప్, రోజి నెల్సన్ ప్రసాద్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!