విద్యుత్ కార్యాలయాలపై అకస్మిక తనిఖీ
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పరిధిలోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల విద్యుత్ కార్యాలయాలను శుక్రవారం సూపరేండెంట్ ఇంజనీర్ ఎస్వి రమణ తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కార్యాలయాల్లోని పలు రికార్డులను తనిఖీ చేసి కార్యాలయ సిబ్బంది ప్రభుత్వం కేటాయించిన విధులకు స మంగా హాజరుకావాలని లేనిపక్షంలో శాఖపరంగా తగు చర్యలు ఉంటాయన్నారు. ముఖ్యంగా విద్యుత్ వినియోగదారుల నుంచి నెలసరి విద్యుత్ బకాయిలు, పాత బకాయిలు ఏమైనా ఉంటే వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు లోటు లేకుండా చేయాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ బకాయిలు రెండు మండలాల్లో అధికంగా ఉన్నాయని వాటిని సక్రమంగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించాడు. విద్యుత్ వసూళ్లలో రాజీ ఉండకూడదని కఠినంగా వ్యవహరించాలన్నారు. బకాయిల వసూళ్లపై సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించని వారి యొక్క విద్యుత్ కనెక్షన్లు తొలగించాలన్నారు. మొండి బకాయిలు ఉన్న విద్యుత్ వినియోగదారులకు రెడ్ నోటీసులు పంపిణీ చేసి విద్యుత్ కనెక్షన్లను శాశ్వతంగా తొలగించాలని సిబ్బందిని ఆదేశించాడు. కోర్టులో దావా వేసి మొండి బకాయిలను వసూలు చేయాలన్నాడు. ప్రభుత్వ మెనూ ప్రకారం నెలసరి విద్యుత్ బకాయిల లక్ష్యాలను అధిగమించాలన్నాడు. బాధ్యతలు చేపడుతున్న విద్యుత్ సిబ్బంది ఆ ప్రాంతాల్లోనే నివాసముండి విద్యుత్ వినియోగదారులకు చేరువలో ఉంటూ విద్యుత్ సమస్యలు ఉంటే తక్షణమే స్పందించి ప్రజల సమస్యలు తీర్చి ప్రజల మన్ననలు పొందాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధులలో అలసత్వం వహిస్తే సిబ్బందిపై శాఖపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇరు మండలాల విద్యుత్ సిబ్బంది తదితరులు ఉన్నారు.