అంగరంగ వైభవంగా కొంతెమ్మ పండుగ

అంగరంగ వైభవంగా కొంతెమ్మ పండుగ

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో ఆదివారం పెద్ద గౌరమ్మ పండు గ ముగింపు సందర్భంగా కొంతెమ్మ పండుగ వేడుకలను మహిళలు, యువతలు,చిన్నారులు ఘనంగా జరుపుకున్నారు.ప్రతి ఏటా పెద్ద గౌరమ్మ పండుగ మరుసటి రోజు రాత్రి ఇళ్ల మిద్దె పై నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు.ముందుగా కొంతెమ్మను మిద్దెల పై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి,చక్కెర హారతులు ఇచ్చి విశేష అలంకరణలో కొంతెమ్మను అలంకరించి మొక్కుబడులు తీర్చుకున్నారు.అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రకరకాల పిండి వంటలను ఆస్వాదించి,చిన్నారులు,యువతి,యువకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.అదేవిధంగా చుట్టూ పక్కల గ్రామాలైన కొగిలతోట,మర్లమాడికి, గెజ్జెహళ్లి,ఎల్లార్తి,వందవాగలి,హెబ్బటం గ్రామాలో కూడా కొంతెమ్మ పండుగను ఘనంగా జరుపుతున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!