బీజేపీ ప్రభుత్వంలో యువతకు తీవ్ర అన్యాయం
యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేద్దాం
యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు :బిజెపి కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు తీరని అన్యాయం జరిగిందని జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మమతా నాగిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు పరిగెల మురళీకృష్ణ అధ్యక్షతన యువజన కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మమతా నాగి రెడ్డి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వ హాయంలో నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతన్నలు అప్పుల పాలు చేసిన ఘనత బిజెపిది అన్నారు. ఉద్యోగాలు కల్పించే ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. ప్రభుత్వ పరిశ్రమలను సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ ఆదాని, అంబానీ కుటుంబాలకు ఊడిగం చేస్తుందని ఆరోపించారు. విద్యుత్ ఒప్పందంలో వేల కోట్ల రూపాయలు మోసం చేసిన ఆదానిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వస్తే దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని కొనియాడారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఇందిరా గాంధీ కుటుంబం అన్నారు. తమ జీవితాల్ని త్యాగాలు చేసిన ఘనత గాంధీ కుటుంబం అన్నారు. దేశంలో యువతదే కీలకపాత్ర అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అనంతరం లక్కరాజు రామారావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతకు హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి పదేళ్లయిన 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మతం పేరుతో కులాల పేరుతో అధికారం చేపట్టేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని ఎద్దేవా చేశారు. అనంతరం డిసిసి అధ్యక్షులు మురళీకృష్ణ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని హామీజీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని మురళి కృష్ణ డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో వారు మొక్కలు నాటిన అనంతరం జిల్లా యువజన కాంగ్రెస్ సమావేశం ప్రారంభమైనది.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఎం ఖాసిం వలి, బి క్రాంతి నాయుడు, యు లక్ష్మీనారాయణ, జి రమేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు కే వెంకట రెడ్డి, యన్ సి బజారన్న, దిలీప్ దోక, ఐఎన్టియుసి అధ్యక్షులు, బి బతుకన్న, మహేంద్ర నాయుడు, రియాజుద్దీన్, సత్యనారాయణ గుప్త, షేక్ ఖాజా హుస్సేన్, డివి సాంబశివుడు, ఎస్ ప్రమీల, షేక్ ఖాద్రి పాషా, అనంతరత్నం, ఎన్ సుంకన్న, వై మారుతి, వీరేష్ యాదవ్, షేక్ షాహిద్ అహ్మద్, షకీల్ పర్దీన్, కార్తీక్, సుమన్, అమన్, షేక్ మాలిక్, రాజు,రవి, శ్రీనిధి రాయల్, దేవిశెట్టి వీరేష్, యజాస్ అహ్మద్, అక్బర్ మొదలగువారు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.