
గుర్తు తెలియని మహిళ హాల్ చల్
హోళగుంద, న్యూస్:మండల పరిధిలో శనివారం సులువాయి గ్రామంలోని ఎంపీయూపీకే పాఠశాల నందు గుర్తు తెలియని ఓ మహిళ పాఠశాలకు వెళ్లి సార్ నాకు పిల్లవాడు ఉన్నాడు ఈ పాఠశాలలో జాయిన్ చేపిస్తాను అని అడిగింది.అయితే ఇక్కడి ఉపాధ్యాయులు నిన్ను మన మండలంలో చూడలేదనీ ప్రశ్నించారు.మరియు నువ్వు ఎవరు అని గట్టిగా ప్రశ్నించగా పరిగెత్తి బయటకు వచ్చేసింది.అంతేకాకుండా పాఠశాల బయట ఉన్న పిల్లలకి బిస్కెట్లు,చాక్లెట్లు,అరటిపండు,జూసు ఇచ్చి తోలుకొని పోవడానికి ప్రయత్నించింది.ఊరిలో ఉన్న పెద్దలు కలిసి ఆ మహిళను పట్టుకొని నీది ఏ ఊరు అని కనుక్కుంటే ఆ అమ్మాయి చెప్పకుండా నాకు మెంటల్ ఉంది అని చెప్పుతుంది.దీంతో గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆ మహిళను పట్టుకొని పోలీస్ వాళ్ళకి అప్పగించారు.ఇంక పై మహిళ ఎక్కడ కూడా కనపడకుండా శిక్షించాలని గ్రామస్థులు పోలీస్ వారిని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!