మూడు కొత్త మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

మూడు కొత్త మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

డిల్లీ : దేశంలో మూడు కొత్త ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్రవేసింది. దేశంలో ప్రధన నగరలైన డిల్లీ , బెంగుళూరు, పూణే లో ఈ ప్రాజెక్టులను మూడు దశలలో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. 15 వేల 611 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బెంగుళూరు మెట్రో యొక్క మూడవ దశ, 12 వేల 200 కోట్ల రూపాయల వ్యయంతో థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ,  దక్షిణ దిశగా స్వర్గేట్ నుండి కత్రాజ్ వరకు పూణే మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్ పొడిగింపు ఉన్నాయని . దాదాపు మూడు వేల కోట్ల రూపాయల ఖర్చు చేయనున్నట్లు మంత్రి వర్గం తెలిపింది.  ఈ కార్యక్రమంలో  నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవ దఫాలో ఇప్పటివరకు లక్షా 54 వేల కోట్ల రూపాయల విలువైన ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందన్నారు.  ఈ  ప్రాజెక్టుల ప్రకటనతో ప్రభుత్వం  మొత్తం ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

 

Author

Was this helpful?

0/400
Thanks for your feedback!

COMMENTS