కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి
పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ
పత్తికొండ /తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల రెడ్డి, రాయలసీమ ఇంచార్జి బీవీఎం శివ శంకర్, డీసీసీ అధ్యక్షులు మురళీ కృష్ణ, కర్నూలు ఇంచార్జి అంబటి రామకృష్ణ ఆదేశాల మేరకు, పోయిన నెల డిసెంబర్ లో జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఈ దేశ రాజ్యాంగాన్ని రచించి, ఈ దేశ సమగ్రతను ప్రపంచానికి చాటి చెప్పి, అపర మేధావిగా కీర్తించబడుతున్న ప్రపంచ మేధావి, నవ యుగ వైతాళికుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను కించపరుస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా అభ్యంతరకర భాష వాడుతూ కించపరిచిన విధానాన్ని నిరసిస్తూ, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి, రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ఇటువంటి వ్యక్తులు, రాజ్యాంగం రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను విమర్శించడాన్ని వ్యతిరేకిస్తూ అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, రాబోయే పంచాయతీ గ్రామ సభ సమావేశాలలో తీర్మానం చేయాలని పత్తికొండ కాంగ్రెస్ కమిటీ తరుపున గ్రామ పంచాయతీ అధికారులను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి క్రాంతి నాయుడు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి గడిచిన 11 సంవత్సరాల లో ప్రతిరోజు రాజ్యాంగంపై విషం చిమ్ముతూ, రాజ్యాంగబద్ధమైన సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఈరోజు రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ ను విమర్శించడం సిగ్గుచేటని, భారత దేశంలో రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మను శాస్త్రాన్ని అమలు చేయాలనే అజెండాతో బిజెపి ప్రభుత్వం ముందుకు వెళుతుందని, లౌకికవాదులు రాజ్యాంగ శ్రేయోభిలాషులు అందరూ ఈ చర్యలను వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు శ్రీ హర్ష, మనల అధ్యక్షులు ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు.