
5 కాలనీల నివాస భవనాలపై మంజూరైన అవసరంలేని 60 అడుగుల రోడ్డు రద్దు చేయాలి
60 అడుగుల రోడ్డు ఎవరి కోసం? అవసరం లేని రోడ్డును ప్రతిపాదించిన అధికారులు వివరణ ఇవ్వాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; నగరపాలక సంస్థ పరిధిలో 5 కాలనీల నివాస భవనాల మీదుగా మంజూరు చేసన 60 అడుగుల రోడ్డును వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరసనలో పాల్గొన్న ముఖ్య అతిథి పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి మాట్లాడుతూ జనసంచారం తక్కువగా ఉన్న నివాస భవనాలపై రహస్యంగా ప్రజలకు తెలపకుండా అవసరంలేని 60 అడుగుల రోడ్డు ఎవరి కోసం మంజూరు చేశారని ప్రశ్నించారు. ఉన్న రోడ్లను కాపాడడం చేతగాని అధికారులు అవసరం లేని నివాస ప్రాంతాల్లో 60 అడుగుల రోడ్లు ఎవరికోసం ప్రతిపాదించారో అధికారులు బహిరంగంగా ప్రకటించాలని కోరారు. కూటమి ప్రభుత్వం స్పందించి అవసరంలేని 60 అడుగుల రోడ్డును రద్దు చేయాలని కోరారు. స్థానిక కాలనీల ప్రతినిధులు ఎం వరప్రసాద్, జి పుల్లారెడ్డి, కే నాగేశ్వరరావు, ఎన్ రమణయ్య
మాట్లాడుతూ ప్రేమనగర్, లక్ష్మణ సింగ్ కాలనీ, పోస్టల్ కాలనీ,కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగర్ బాలాజీ నగర్ మీదుగా జాతీయ రహదారి వరకు 20 నుండి 40 అడుగులు రోడ్లు మాత్రమే ఉన్న మా కాలనీలపై ఎలా 60 అడుగుల రోడ్డు మంజూరు చేస్తారని ప్రశ్నించారు. 30,40 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఇండ్లపై మా అనుమతి లేకుండా 60 అడుగుల రోడ్డును మంజూరు చేసిన విషయం తెలిసినప్పటినుండి వందలాది భవన యజమానులకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతులు బ్యాంకు లోన్లు కూడా ఇవ్వడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ పర్యటనలో పలు కాలనీల ప్రతినిధులు రాజేశ్వర్ రెడ్డి, రామచంద్రయ్య, మాణిక్య రెడ్డి, మహమ్మద్ యునిస్, వెంకట్ రెడ్డి, న్యాయవాది రవికుమార్, కన్వర్ భాష, నయూమ్ తదితరులు పాల్గొన్నారు.