జల్ జీవన్ మిషన్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించండి : డిప్యూటీ సీఎం

జల్ జీవన్ మిషన్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించండి : డిప్యూటీ సీఎం

అమరావతి : ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచి నీరు అందాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని వినియోగించుకొంటున్నారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశయాలతో ఈ పథకాన్ని పరుగులు తీయించబోతున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ తాగునీటిని అందించాలనే తలంపుతో 2019లో ‘హర్ ఘర్ జల్’ నినాదంతో మొదలుపెట్టిన జల్ జీవన్ మిషన్ పథకం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పథకానికి కేంద్రం రూ.3.60 లక్షల కోట్లను కేటాయించిన నేపథ్యంలో నిధుల కొరత లేదు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు అందించి పూర్తిస్థాయిలో పనులు చేసుకోవచ్చు. మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయిలు… నిరంతరాయంగా రక్షిత నీటి సరఫరా జల్ జీవన్ మిషన్ లో 80 శాతం పూర్తయిన పనులు సత్వరమే పూర్తికి చర్యలు గత ప్రభుత్వంలో లెక్కలన్ని తప్పులు జరిగాయి. రాష్ట్రంలోనూ 2019 – 2024 సంవత్సరాల మధ్య జల్ జీవన్ మిషన్ నిధులతో జరిగిన పనుల వల్ల రాష్ట్రంలో 72.62 శాతం గ్రామీణ ప్రాంతాల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు చూపారు. రాష్ట్రంలోని 5,931 గ్రామాలు 100 శాతం కుళాయి కనెక్షన్ ఉన్న గ్రామాలుగా లెక్కలు చెప్పారు. సుమారుగా రూ.4 వేల కోట్ల పనులు జరిగినట్లు లెక్కలు చెప్పారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలిస్తే, అధికారుల సమీక్షల్లో అసలు లెక్కలు తీస్తే గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా జరిగిన జల్ జీవన్ మిషన్ పనులే కనిపించాయి. కేవలం పైపులైన్లు వేసి కనెక్షన్ ఇవ్వకుండా వదిలేసినవి… గుంతలు తవ్వి వదిలేసినవి కనిపించాయి. గత ప్రభుత్వం చెప్పిన లెక్కలకు క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో అందుతున్న మంచినీటి సౌకర్యాలకు, కనెక్షన్లకు సంబంధం లేకపోవడంతో కూటమి ప్రభుత్వం గత అయిదేళ్లలో జరిగిన జల్ జీవన్ మిషన్ పనులపై పల్స్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మొత్తం 9.84 లక్షల ఇళ్లకు డబుల్ కనెక్షన్, తప్పుడు పేర్ల మీద కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. 28.66 లక్షల ఇళ్లకు అసలు కుళాయిలే లేవని తేలింది. గత ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు ఉపయోగపడేవి లేకపోవడంతో జల్ జీవన్ మిషన్ పథకం అమలులో కొత్త విధానంలో ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.  ఆధునిక పరిజ్ఞానం వినియోగించాలి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ద్వారా పూర్తి స్థాయి అధ్యయనం జల్ జీవన్ మిషన్ పథకాన్ని సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్లేలా నిర్ణయించారు. 2027 చివరి నాటికి జల్ జీవన్ మిషన్ పనుల్లో పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. 80శాతం పూర్తయిన పనులను సత్వరమే పూర్తి చేసి రక్షిత నీరు అందించాలని, సంబంధిత కాంట్రాక్టర్ వాటి నిర్వహణ పనులు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరగాల్సిన పనుల్ని రీ గ్రౌండింగ్ చేయాలని నిర్ణయించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS