ఎం.పి బస్తిపాటి నాగరాజు ఆధ్వర్యంలో టిడిపి లో చేరిన వైకాపా శ్రేణులు
న్యూస్ వెలుగు, కర్నూలు; తెలుగుదేశం పార్టీతో నే అభివృద్ధి సాధ్యమని గ్రహించి వైకాపా శ్రేణులు టిడిపి కొనసాగింపు త థ దలో చేరుతున్నారని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు… కర్నూలు రూరల్ మండలంలో ని పంచలింగాల గ్రామంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ అయ్యన్న తనయుడు సాయి తో పాటు అతని కుటుంబ సభ్యులు, వైకాపా కార్యకర్తలు దాదాపు 70 మంది దాకా ఎం.పి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎం.పి నాగరాజు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ని సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తామన్న జగన్ కు, వైకాపా నుంచి పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా దొరకరని విమర్శించారు.. రాష్ట్రంలో త్వరలో నే వై ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్న ఎం.పి.. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు తోనే సాధ్యమవుతుందని తెలిపారు..