గజ్జెహళ్లిలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

గజ్జెహళ్లిలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించేది ‘వాల్మికి జయంతి: ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి

 ముఖ్య అతిథులుగా ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, సిరుగుప్ప మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప
కర్నూలు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి సురేందర్ నాయుడు,మాజీ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు

 ఆకట్టుకున్న హరేశ్రీనివాస భజన మండలి, చిన్నారుల కోలాటలా నృత్య ప్రదర్శన, డమరుకల (డోళ్ళు) నాదం

 హొళగుంద, న్యూస్ వెలుగు: ఎందరో మహనీయులు జన్మించిన పుణ్యభూమి భరతభూమి. ఈతరం వారు ఇలాంటి మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకోవడం ద్వారా స్ఫూర్తిని పొంది వారి మార్గలో పయనించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. అలాంటివారిలో అగ్రగన్యుడు అలాంటి ఓ మహానీయులు శ్రీ ఆదికవి మహర్షి వాల్మీకి. హిందువుగా జన్మించిన ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన ఆదర్శకవ్యం రామాయణం అలాంటి రామాయణాన్ని రచించినది వాల్మీకి మహర్షి హొళగుంద
మండలం పరిధిలోని గజ్జెహళ్లి గ్రామంలో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే విరూపాక్షి, సిరుగుప్ప తాలూకా మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, సురేందర్ నాయుడు, రామ్ భీం నాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ….బోయ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ శ్రీ వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. లక్షల సంవత్సరాలు చరిత్ర కలిగిన జాతి బోయ జాతి. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన వాల్మీకి బోయలకు ఈనాడు వాల్మీకి జాతికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తీరని అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఓటింగ్ మిషన్ లాగా వాల్మీకులను వాడుకున్నారే గాని వాల్మీకులకు న్యాయం చేద్దామని ఆలోచన లేదు. భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో బీసీ-ఏ గా కొనసాగుతున్నాం. పక్కనే ఉన్న కర్ణాటకలో విచరించుకోండి ఇది నిజాలు తెలుస్తాయి ఎంతమంది నాయకులు ఎస్టీ జాబితాల కోసం పోరాటాలు చేస్తుంటే అసెంబ్లీలో తీర్మానం అంటారు. పార్లమెంట్లకు పంపామని అని చెబుతారు. మళ్ళీ దాని గురించి మాట్లాడరు వాల్మీకులను రాజకీయ పరంగా విద్యాపరంగా ఎదగనివ్వకుండా అడ్డుకోవాలని చాలా మంది నాయకులు చేస్తున్న కుట్రగా భావించవచ్చు. రాయలసీమలో అత్యధిక సంఖ్యా బలం ఉన్న వాల్మీకులకు రిజర్వేషన్లు దక్కాలంటే ఎస్టీ పునరుద్ధరణ జరిగి తీరాల్సిందే దానికి ప్రతి వాల్మీకి బిడ్డ దీనికి బాధ్యత వహించి పోరాటానికి ముందుకు రావాలి. రిజర్వేషన్ లేకుంటే పెరుగుతున్న పోటీ ప్రపంచంలో నువ్వు రేపు లక్షలు కోట్లు పెట్టి చదివిన నీ బిడ్డల ప్రభుత్వ రంగంలో ఉన్నత విద్యారంగంలో సీట్లు గాని, ఉద్యోగం గానీ,రాజకీయ రంగాల్లో అవకాశాలు కానీ రావు.కాబట్టి ప్రతి ఒక్క వాల్మీకి ఐక్యమత్యంతో ముందుకు సాగుదాం ఎస్టీ రిజర్వేషన్లు సాధించుకుందాం మరొక్కసారి గజ్జహల్లి గ్రామ ప్రజలందరికీ శ్రీ వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఆకర్షణీయంగా చిన్నారుల సంకీర్తన వేషధారణ, సిరుగుప్ప డమరుక(డోళ్లు ) బృందం, హరే శ్రీనివాస భజన మండలి బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Author

Was this helpful?

Thanks for your feedback!