వాల్టా చట్టానికి తూట్లు…. స్పందించని అటవీ శాఖ అధికారులు
పుట్టపర్తి : అనంతపురం జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదు అవుతున్న తరుణంలో చెట్లను విరివిగా పెంచాలని ప్రభుత్వం వాల్టా చట్టాన్ని అమలులోకి తెస్తే దానిని అటవీ అధికారులు తూట్లు పొడుస్తున్నారని ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ ఏ చెట్టును కొట్టకూడదని నిబంధనలు ఉన్న వాటిని తుంగలో తొక్కి రైతులు , వ్యాపారస్తులు, రోడ్లు విస్తరణ, విద్యుత్ లైన్లు, లేఔట్లు, ఏర్పాటు వలన మహా వృక్షాలను సైతం నరికెస్తున్నారని ఇలా చెట్లను నరికితే అనంతపురం జిల్లాకు తీవ్ర కరువు కోరల్లో చిక్కుకొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఎవరైనా చెట్లును నరికితే వెంటనే అటవీ అధికారులు నోటీసులు జారీ చేసి వాహనాలను సీజ్ చేయాలి, ఆదివారం కొంతమంది కర్ణాటక వ్యాపారస్తులు పుట్టపర్తి మండల పరిధిలోని కప్పల బండ గ్రామంలో కర్ణాటక కు చెందిన కొంతమంది కలప వ్యాపారస్తులు ఆదివారం చెట్లను నరికుతూ వాటిని తరలిస్తున్న తరుణంలో వాటిని అడ్డుకొని పుట్టపర్తి తాసిల్దార్ అనుపమకు పర్యావరణవేత్త సమాచారం ఇవ్వడంతో ఆమె వీఆర్ఏలకు సమాచారం ఇచ్చి తరలిస్తున్న కలపను అడ్డుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్లను నరక్కుండ ఆపాలని ఆయన కోరారు.