
సందోలి తిరుపాల్ ను సన్మానించిన వీరన్న
పత్తికొండ న్యూస్ వెలుగు : దేవనకొండ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మాచపురం వీరన్న మాదిగ గురువారం పత్తికొండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు తిరుపాల్ మాదిగకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయనను సన్మానించినట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నుంచి నేటి వరకు దళితులపై జరుగుతున్న కుల వివక్షతను, అంటరాని తనాన్ని, ఉన్నత వర్గాల నిరంకుశత్వాన్ని,అగయిత్యాలను ఎండగడుతూ…కుటిల రాజకీయంలో మాదిగలను చేయిపట్టి నడిపించారన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మార్పీఎస్ రాజకీయంగా బలపడుతుందని దేవనకొండ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు వీరన్న మాదిగ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు హుసేని కొండన్న రామాంజనేయులు యేసన్న తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

