
తాడిపత్రి అసెంబ్లీ టిడిపి అబ్జర్వర్ గా బత్తిన వెంకటరాముడు
తుగ్గలి న్యూస్ వెలుగు: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం టిడిపి అబ్జర్వర్ గా కర్నూలు ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడును టిడిపి అధిష్టానం నియమించడంతో బుధవారం తాడిపత్రి పట్టణంలో టిడిపి మండల,గ్రామ మరియు పట్టణ కమిటీలు ఎన్నికల నిర్వహించేందుకు తాడిపత్రికు వెళ్లి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట రాముడు మాట్లాడుతూ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తాడిపత్రి నియోజకవర్గ అబ్జర్వర్ గా బాధ్యతలు స్వీకరించి తన విధులను సక్రమంగా నిర్వహిస్తానని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!