
ఈ నెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి
జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్
పుట్టపర్తి, న్యూస్ వెలుగు; ఈ నెలాఖరిలోగా ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. మంగళవారం అమరావతి నుండి సి సి ఏ కార్యాలయం నుండి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులుమంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రీహోల్డ్ చేసిన భూముల పరిశీలన, ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు పరిష్కారం, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్ పరిస్థితి పై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు ఈ కార్యక్రమంలోరెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ R.P. సిసోడియా, సెక్రటరీ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ నందు రెవిన్యూ శాఖ మంత్రి వర్యులు మాట్లాడుతూసీఎంఓ, రెవెన్యూ మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన గ్రీవెన్స్ పై వెనువెంటనే స్పందించాలని పేర్కొన్నారు.గ్రీవెన్స్ ఎప్పటికప్పుడు జీరో స్థాయికి తీసుకురావాలని కలెక్టర్లకు మంత్రి అనగాని ఆదేశం. స్థానిక కలెక్టరేట్లోని కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ కొండయ్య తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూఈ నెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు, పెనుగొండ డివిజన్లో వెరిఫికేషన్ పక్రియ కొరకు అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు డిప్యూటీ కలెక్టర్ రప్పించి కార్యక్రమంలో వేగవంతం చేయుచున్నామని
ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడానికి. ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించాలని అధికారులంతా ఆ రోజు కార్యాలయాల్లో ఉండాల్సిందేనని, మండల అధికారులకు, డివిజన్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగిందని వివరించారుఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్, రిజిస్టర్ కాబడ్డ ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్, ప్రజల నుండి వచ్చిన అర్జీలకు పరిష్కారం, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్ అంశాల జిల్లా కలెక్టర్ మంత్రివర్యులకు వివరించారు.ఈ కార్యక్రమంలో పెనుగొండ ఆర్డిఓ ఆనంద్, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, ధర్మారం ఆర్డీవో మహేష్, కదిరి ఆర్డీవో వంశీకృష్ణ, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

