క్యాన్సర్ పై విజయం,స్క్రీనింగ్ తోనే సాధ్యం
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా గురువారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రీలక్ష్మి,డాక్టర్ రాగిణిల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తోనే సాధ్యమని ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ నుండి కాపాడుకోవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ ప్రొవైడర్లు మరియు హెల్త్ సెక్రటరీలు,ఆశా కార్యకర్తలు ఆరోగ్య బృందాలుగా ఏర్పడి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి,బ్రెస్ట్ క్యాన్సర్,సర్వైకల్ క్యాన్సర్,ఓరల్ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.పింక్ కలర్ రిబ్బన్ బ్రెస్ట్ క్యాన్సర్,టీల్ కలర్ రిబ్బన్ సర్వైకల్ క్యాన్సర్,బ్రిక్ రెడ్ కలర్ రిబ్బన్ నోటి క్యాన్సర్ ను సూచికగా మూడు రంగుల రిబ్బను ధరించి వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బంది స్థానిక కె.వి.ఆర్ గర్ల్స్ హై స్కూల్ ను సందర్శించి ఈ మూడు రకాల క్యాన్సర్ పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిరంజన్ బాబు,హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా,ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణమ్మ, సూర్యనారాయణ,హెల్త్ ప్రొవైడర్లు మంజుల,అంజలి,ఐశ్వర్య,ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్,ఫార్మసిస్ట్ జ్యోతి,ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.