
ఆత్మకూరు ఇస్తేమా ఏర్పాట్లను సందర్శించిన విజయ్ చౌదరి
న్యూస్ వెలుగు, ఆత్మకూరు: నంద్యాల జిల్లా, ఆత్మకూరు పట్టణంలో జనవరి 7, 8, 9 తేదీలలో జరగబోయే ఉమూమి తబ్లిగీ ఇస్తేమా ఏర్పాట్లను దగ్గరుండి స్వయంగా సందర్శించిన 16వ వార్డు కౌన్సిలర్ విజయ్ చౌదరి. ఇస్తేమా కొరకు JCB వెహికల్ తో పాటు రోటవేటర్, ట్రాక్టర్ లను ఇస్తేమా పనుల కోసం ఉచితంగా అందుబాటులో ఉంచడం జరిగింది.
ఇస్తేమా పనులకు సంబంధించి తన వంతు సహాయ,సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. వచ్చే సంవత్సరం జనవరిలో జరిగే ఇస్తేమా కొరకు ఉమ్మడి జిల్లాలు కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాలకు సంబంధించి లక్షలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని, అందుకోసం ప్రతి ఒక్కరూ ఇస్తేమాకు సంబంధించి కార్యక్రమాల్లో ముందుండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విజయ చౌదరి, గౌస్ లాజం, నూర్ బేగ్, హబీబుల్లా, కూరగాయల హసన్, శాలి పైల్వాన్, మోటర్ షఫీ, కలిముల్లా బేగ్, మొదలగు వారు పాల్గొన్నారు.